వరంగల్ చపాటా మిర్చికి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించినట్లు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి దండా రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం (ఏప్రిల్ 2) ధ్రువీకరణ పత్రం అందిందని అన్నారు. టమాటా ఆకారంలో ఉండే వీటిని ‘టమాటా మిరపకాయ’ అని కూడా స్థానికంగా పిలుస్తారు. వీటిని ఆహార, పానీయాలు, సౌందర్య సాధనాలు, ఔషధ, వస్త్ర పరిశ్రమల్లోనూ వినియోగిస్తారు.