గ్రేటర్ వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వరంగల్ భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.5,257 కోట్లు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.5,257 కోట్లతో డీపీఆర్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు కావటంతో ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.