వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు రాకేష్ ఇవాళ ఉదయం తన సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.