వరంగల్‌లో మహిళా శక్తికి ప్రతీకగా 'రుద్రమ' కమాండో బృందం సిద్ధమైంది. తెలంగాణలోనే తొలిసారిగా రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక దళం, కఠిన శిక్షణతో శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా తయారైంది. ఉన్నత విద్యావంతులు, క్రీడాకారులతో కూడిన ఈ బృందం.. ఆయుధ శిక్షణతో పాటు ఆత్మరక్షణలోనూ రాణిస్తోంది. అల్లర్లు, బందోబస్తు, కూంబింగ్ ఆపరేషన్లలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.