తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే.. వరంగల్‌ను అన్ని రకాలు అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పలు రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు వైద్య రంగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను శరవేగంగా కొనసాగిస్తోంది. కాగా.. ఈ నెలాఖరులోగా ఆస్పత్రి నిర్మాణంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.