తెలంగాణలో వచ్చిన వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కార్పోరేషన్ ఛైర్మన్లు కూడా తమ రెండు నెలల జీతాన్ని బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.