Center Help to AP: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి సీఎం చంద్రబాబు వివరించారు. వరదలతో విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు అతలాకుతలమయ్యాయని.. ఈ క్రమంలో కేంద్రం సహాయం అవసరమని చంద్రబాబు అడిగారు. చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. 40 పవర్ బోట్లు, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, 6 హెలికాప్టర్లను పంపిచనున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ రేపు ఉదయం విజయవాడకు చేరుకోనున్నాయి.