విజయవాడలో వరదలు ఎంతగా బీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సర్వం కోల్పోయి వారు పడుతున్న కష్టాలు మనందరి కళ్లముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ప్రాణ నష్టంతో పాటుగా భారీగా ఆస్తి, పంట నష్టం దెబ్బతింది. ఈ నేపథ్యంలో వరదల కారణంగా ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్న వారికి సర్కారు కీలక విషయం వెల్లడించింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం విజయవాడ కలెక్టరేట్‌లో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.