వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గన్నవరంలోని ఆయన ఇంటి దగ్గర్లోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయనను గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరోవైపు.. వల్లభనేని వంశీ అనుచరుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.