Vallabhaneni Vamsi Another Case: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. హైకోర్టు లాయర్ సతీమణి ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో రూ.10 కోట్లు విలువైన స్థలం కబ్జా చేశారని.. అది తన పేరు మీద ఉందని హైకోర్టు న్యాయవాది భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు వంశీ అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.