వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మర్పల్లి మండలం బిల్‌కల్‌లో వివాహేతర సంబంధం ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చేరాల నర్సింలు (39) అనే రైతును బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన బేగరి నర్సమ్మతో ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే నర్సమ్మ, ఆమె భర్త పాపయ్య కలిసి నర్సింలును పొలం వద్ద హత్య చేసినట్లు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.