హైదరాబాద్: కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పెద్ద సంఖ్యలో పావురాలు చనిపోతున్నాయి. ఇవి మరణించడానికి గల కారణాలేంటనేది అంతుచిక్కడం లేదు. వందల సంఖ్యలో పావురాలు చనిపోతుండటంతో.. వాకింగ్‌కు వచ్చిన వారు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అధికారులెవరూ పట్టించుకోవడం లేదని వాకర్స్ చెబుతున్నారు. కనీసం చనిపోయిన పావురాలనైనా అక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నారు.