ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ రుద్రారపు హరీష్ సూసైడ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్‌లో చిక్కుకొని ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. హరీష్ ఒంటిరిగా రిసార్ట్‌కు వెళ్లలేదని.. కూడా ఓ అమ్మాయి కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి ఎన్నో కేసులు చూసిన ఎస్‌ఐ హనీట్రాప్‌లో చిక్కుకోవటం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హానీ ట్రాప్‌లో చిక్కుకొని ఆత్మహత్య చేసుకోవటం దారణమని అంటున్నారు.