కరీంనగర్ జిల్లాలో భారత పత్తి సంస్థ (సీసీఐ) (CCI) ద్వారా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో నాలుగు జిన్నింగ్ మిల్లులు, పెద్దపల్లి మార్కెట్ యార్డులో కేంద్రాలను ఏర్పాటు చేశారు. తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని.. 12 శాతానికి మించిన పత్తిని ప్రైవేటు ట్రేడర్లు కొనుగోలు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. కౌలు రైతులు ఇకపై ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఏఈవోల డిజిటల్ నమోదు ద్వారా పత్తిని విక్రయించవచ్చు. రైతులు 'కిసాన్ కపాస్' యాప్ ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకోవాలి. 72 గంటల్లో చెల్లింపులు జరుగుతాయి.