ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజలకు పౌర సేవలు మరింత సులభతరంగా అందించాలనే ఉద్దేశంతో మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా 161 పౌర సేవలను తొలి విడతగా అందిస్తున్నారు. ఇందులో ఆలయాల దర్శనాలు, సేవా టికెట్ల జారీకి కూడా అవకాశం కల్పించారు. అయితే వాట్సాప్‌లో ఆలయాల దర్శనం, సేవా టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ట్రాన్సాక్షన్లు విఫలమైతే డబ్బులు తిరిగి చెల్లించాలని దేవాదాయ శాఖ ఆదేశించింది.