వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ..

3 hours ago 1
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు పగటిపూట అత్యవసర పనులుంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article