దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ఏదైనా కొనాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రతి ఒక్కటి రెడీమేడ్‌గా దొరుకుతుండటంతో.. ప్రజలు వాటికే అలవాటు పడిపోయారు. కాగా.. ఇదే అసరాగా తీసుకుని కొంత మంది కేటుగాళ్లు.. నిబంధనలకు నీళ్లొదిలేసి, ప్రజల ఆరోగ్యాలను గాలికివదిలేసి.. కాసుల కక్కుర్తితో కల్తీ దందాలు నడిపిస్తున్నారు. అందులో భాగంగానే.. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఎలా తయాలు చేస్తున్నారన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.