రాష్ట్రంలో సంచలనంగా మారిన యువ డాక్టర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సుమంత్ రెడ్డిపై హత్యకు యత్నించింది.. ఆయన భార్య, ఆమె ప్రియుడేనని పోలీసులు తేల్చారు. అయితే.. పిల్లలు పుట్టట్లేదని, ఫిట్‌నెస్ పెంచుకోవాలని డాక్టర్ సూచిస్తే.. జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయకుండా ట్రైనర్‌పై వ్యామోహంతో మంచి జీవితాన్ని మర్డర్ అటెంప్ట్ వరకు తీసుకెళ్లింది.