AP Cm Chandrababu Naidu Varanasi Tour: వారణాసి పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కాశీ విశ్వేనాథుడిని దర్శించుకున్నారు. ఆయన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు వారణాసి-వాద్‌నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకెళుతుందన్నారు. ప్రధాని మోదీ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు చంద్రబాబు.