రాష్ట్రవ్యాప్తంగా పదేళ్లుగా లావాదేవీలు లేని బ్యాంకు ఖాతాల్లో రూ.2,095 కోట్లు నిలిచిపోయాయి. 78 లక్షలకు పైగా ఖాతాల్లోని ఈ డబ్బును డిపాజిటర్ల విద్యా నిధికి బదిలీ చేసే ముందు, బ్యాంకులు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాయి. డిసెంబర్ 31 లోపు క్లెయిమ్ చేసుకోకపోతే ఈ డబ్బు ప్రభుత్వ నిధికి చేరుతుంది. కుటుంబ సభ్యులు 'ఉద్గం' పోర్టల్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.