ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో 155 మంది ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి కోసం రూ.1.55 కోట్ల రుణాలను అందజేసింది. అంతేకాకుండా, నలుగురు ట్రాన్స్‌జెండర్లకు గ్రాఫిక్ డిజైన్‌లో శిక్షణ ఇప్పించి, ఉద్యోగ నియామక పత్రాలను అందజేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.