ఏపీ మంత్రి నారాయణ విజయవాడలో శనివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. గత కొన్నిరోజులుగా వర్షం పడుతున్న నేపథ్యంలో.. పలు ప్రాంతాలలో పర్యటించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలోనే అవుట్ ఫాల్ డ్రెయిన్ల కారణంగా నీటి ప్రవాహానికి ఇబ్బందులు కలుగుతున్న సంగతి మంత్రి గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను నారాయణ ఆదేశించారు. ఇళ్లు కోల్పోయేవారికి టిడ్కో ఇళ్లు కేటాయించాలని సూచించారు.