తెలంగాణలో రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రమాదం జరిగిన వారం రోజుల్లోపు రూ.1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స అందించనున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద నమోదైన ఆసుపత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.