అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమవలసదారులను భారత్‌కు తరలించిన నేపథ్యంలో.. వారి కాళ్లు చేతులు కట్టేసి తీసుకురావటంపై కేఏ పాల్ సీరియస్ అయ్యారు. వాళ్లేమైనా ఉగ్రవాదులా.. రేపిస్టులా అని ప్రశ్నించారు. భారతీయుల కోసం తాను ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.