Nara Lokesh Tweets RTO Officer Video: ప్రైవేట్ టావ్రెల్స్ బస్సుల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో రవాణఆశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బస్సుల్లో ప్రయాణించేవారికి కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ అధికారి ట్రావెల్స్ బస్సును ఆపి ప్రయాణికులకు కొన్నిజాగ్రత్తలు చెప్పారు. ఒకవేళ బస్సుల్లో మంటలు చెలరేగితే విలువైన వస్తువుల కోసం సమయం వృథా చేయొద్దని సూచించారు. ప్రయాణికులు బస్సు ఎక్కగానే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ముందే తెలుసుకోవాలన్నారు.