Independence Day Celebrations In Hyderabad: దేశ వ్యాప్తంగా రేపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. 79వ సెలబ్రేషన్స్‌కు ఇటు హైదరాబాద్‌లో గోల్కొండ కోటలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ వేడుకల సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని రూట్లను బంద్ చేశారు. మరికొన్ని రూట్లలో మళ్లింపు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా.. గోల్కొండ కోట సమీపంలో నివసించే వారు వాహనాలను రహదారులపై పార్కింగ్ చేయవద్దని పోలీసులు సూచించారు.