విశాఖపట్నంలోని వాహనదారులకు గుడ్ న్యూస్.. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త ఆర్వోబీ అందుబాటులోకి వస్తోంది. ఎన్ఏడీ జంక్షన్ - కాకానినగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రంగులతో తుది మెరుగులు దిద్దుతున్నారు. మరో రెండు రోజుల్లో అంటే ఫిబ్రవరి 15వ తేదీన ఈ రైల్వేఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఆర్వోబీ అందుబాటులోకి వస్తే ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేవారికి ఉపయోగకరంగా ఉండనుంది.