సినీ హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాల్సిందిగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు పంపారు. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.