విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. మహిళల బాత్రూంలోకి చొరబడిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఆడవాళ్లు బాత్రూంలోకి వెళ్లడం గమనించి.. వారిని వీడియోలు తీసేందుకు ప్రయత్నించగా.. అది గుర్తించిన మహిళలు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. దీంతో అతడి ఫోన్ మొత్తం చెక్ చేసిన పోలీసులు.. అతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పటినుంచి ఉన్నాడు అని ఆరా తీస్తున్నారు.