Vijayawada Temple Laddu Potu Anna Prasadam Buildings: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిపై లడ్డూ పోటు, అన్నప్రసాద కేంద్రం కోసం కొత్త భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 21న లాంఛనంగా ప్రారంభించాలని భావిస్తున్నారు.. అయితే దసరా నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు కొత్త భవనాలకు పేర్లు కూడా నిర్ణయించనట్లు తెలుస్తోంది.