Vijayawada Durgamma Jewellery: విజయవాడ కనకదుర్గమ్మకు రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాభరణాలు అందనున్నాయి. ఒక ప్రముఖ సంస్థ ఈ కానుకను అందజేయనుంది. ఈ ఆభరణాలలో ముక్కుపుడక, మంగళసూత్రాలు ఉన్నాయని సమాచారం. ఆలయ అభివృద్ధి ప్రణాళికలను ఈ సందర్భంగా అధికారులు వివరించనున్నారు. అయితే ఈ ఆభరణాలకు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల దసరా ఉత్సవాల సందర్భంగా కూడా భక్తులు అమ్మవారికి బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు.