విజయవాడలో ఓ సెలూన్ షాప్ నిర్వాహకుడికి రూ.72 లక్షలు కట్టాలంటూ జీఎస్టీ నోటీసులు రావటం చర్చనీయాంశంగా మారింది. పంజా సెంటర్‌లో సెలూన్ షాప్ నిర్వహించే శ్రీనివాసరావు అనే వ్యక్తికి.. ఇటీవల జీఎస్టీ నోటీసులు వచ్చాయి. విశాఖలో ఐరన్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నట్లుగా పేర్కొంటూ 72 లక్షల రూపాయలు జీఎస్టీ చెల్లించాలని నోటీసులలో ఉంది. దీన్ని చూసి శ్రీనివాసరావు నిర్ఘాంతపోయారు. ఇదే క్రమంలోనే అతని బ్యాంక్ అకౌంట్ కూడా హోల్డ్ చేయటంతో లబోదిబోమంటున్నారు.