Vijayawada Flood Areas Damaged Certificate: విజయవాడ వరదలతో ఎంతోమంది నష్టపోయారు.. ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో విలువైన వస్తువులు, సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లు పాడైపోయాయి. దీంతో విద్యార్థులు, రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించింది. వరదల్లో సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లు పోగొట్టుకున్నవారికి తిరిగి అందజేస్తామని తెలిపింది. దీని కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తామంటున్నారు అధికారులు. మంత్రి లోకేష్ కూడా ఈ అంశంపై స్పందించారు.. అలాగే విద్యార్థులకు సర్టిఫికేట్లను తిరిగి అందజేస్తామని చెప్పారు.