Vijayawada Woman Died After Falling Into Hot Sambar Vessel: విజయవాడలో వినాయక మండపం దగ్గర ఏర్పాటు చేసిన అన్నదానం కోసం తయారు చేసిన సాంబార్ పాత్రలో పడి మహిళ చనిపోయింది. విజయవాడలోని కేఎల్‌రావు నగర్‌లో ఈ ఘటన జరిగింది. సాంబారు పాత్రను పొయ్యి మీద నుంచి కిందకు దించి తీసుకొస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మహిళ సాంబారు పాత్రలో పడిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయింది.