విజయవాడ, వైజాగ్ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం రూ. 21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించనున్నారు. తొలిదశలో విజయవాడ మెట్రో కోసం రూ. 10,118 కోట్లు, వైజాగ్ మెట్రో కోసం రూ. 11,498 కోట్లతో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇందుకు నోటిఫికేషణ్ జారీచేయనుంది . ఈ ప్రాజెక్టుల ద్వారా బెజవాడ, వైజాగ్ నగరాల్లో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.