ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు నగరాల్లో తిరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం కింద విజయవాడకు 100 బస్సులు కేటాయించనున్నారు. కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో, ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాధరపురం డిపోలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బస్సులు 15 రూట్లలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ పేరుతో నడుస్తాయి. డీజిల్ వ్యయం తగ్గడంతో ఆర్టీసీకి ఆర్థిక భారం తగ్గుతుంది.