Vijayawada Flood Areas Free Laundry Service: విజయవాడలో వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరూ తమవంతుగా సాయం అందిస్తున్నారు.. కొందరు విరాళాల రూపంలో సాయపడితే, మరికొందరు ఆహారం అందిస్తున్నారు. అలాగే వరదతో నష్టపోయిన ప్రజల కోసం కొందరు మెకానిక్‌లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఓ మెకానిక్ ఉచితంగా గ్యాస్ స్టవ్‌లు రిపేర్ చేస్తుంటే.. తాజాగా మరో యువకుడు ఉచితంగా డ్రై క్లీనింగ్ సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.