Vijayawada Gas Stove Free Service: విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. భోజనం, దుస్తులు, నిత్యావసరాలు ఇలా కొందరు దాతలు నేరుగా విజయవాడ వచ్చి బాధితులకు అందజేస్తున్నారు. మరికొందరు విరాళాల రూపంలో చెక్కుల్ని ఏపీ ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఇటు వాహనాల బీమా అంశం, రిపేర్లపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే విజయవాడలో వరద బాధితుల గ్యాస్ స్టవ్‌లు రిపేర్ చేసేందుకు ఓ మెకానిక్ ముందుకొచ్చారు. ఉచితంగా గ్యాస్ స్టవ్‌లు రిపేర్ చేస్తూ పెద్ద మనసు చాటుకున్నారు.