విజయవాడలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను గుర్తుతెలియని దుండగుడు తగులబెట్టాడు. భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య వీధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. చేతిలో సంచితో ఉన్న ఓ వ్యక్తి మెల్లిగా వచ్చి పార్క్ చేసి ఉన్న బైకులకు నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నెల రోజులుగా విజయవాడ నగరంలో ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయి. భవానీపురంలో జరిగిన ఘటనలో స్థానిక సీసీ టీవీ పుటేజుల్లో వ్యక్తి దగ్ధం చేస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపించాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.