విజయవాడలో దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డుపై భార్యను గొంతుకోసి భర్త హత్య చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. గొడవలు రావడంతో కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్యపై కోపం పెంచుకున్న ఆ భర్త.. అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఆమెపై కత్తితో దాడి చేశాడు. హత్య తర్వాత ఆ కత్తి పట్టుకుని హల్‌చల్ చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.