వినూత్న ప్రయోగానికి ఏపీ వేదిక అయ్యింది. విజయవాడ వేదికగా సూపర్ ప్రెజర్ బెలూన్ విజయవంతంగా ప్రయోగించారు. భారతదేశంలోనే తొలిసారిగా ఈ వినూత్న ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా మారింది. ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఈ చరిత్రాత్మక కార్యక్రమం రాష్ట్ర సాంకేతిక ప్రగతికి మరో మైలురాయిగా నిలిచింది.గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్, టెలికాం సేవలను చేరవేయాలనే లక్ష్యంతో ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ ప్రయోగించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ, నరసరావుపేట ఎంపీలు పాల్గొన్నారు.