Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kits 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు.. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి.. 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర' కిట్లు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో సకాలంలో విద్యార్థులకు ఈ కిట్లను అందించేందుకు నవంబర్ నుంచే ప్రణాళికలు మొదలుపెట్టింది. డిసెంబర్‌లో టెండర్లు పిలిచి, జనవరిలో వాటిని ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరిలో నాణ్యత పరిశీలన, మేలో జిల్లాలకు, మండలాలకు చేరవేసి, జూన్ 12న విద్యార్థులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.