రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, ఐవోటీ వంటి అధునాతన రంగాల్లో వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇన్ఫోసిస్ సహకారంతో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరిలో తొలుత అమలుచేస్తారు. ఈ వాహనాన్ని మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు.