నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మండలంలో పచ్చ కామెర్ల వ్యాధి పిల్లల్లో విస్తరించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. జిల్లా వైద్యాధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆ పాఠశాలకు 10 రోజులు సెలవులు ప్రకటించారు. కలుషితమైన తాగునీరు వ్యాప్తికి కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. తమ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని.. వ్యాధికి గల కారణాన్ని గుర్తించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.