తెలంగాణలో దసరా సెలవుల అనంతరం శనివారం లేదా సోమవారం నాడు కాలేజీలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 6 నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్‌కు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి గతంలో రూ.1200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా.. ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో.. అక్టోబర్ 6 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని యోచిస్తున్నాయి.