తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అక్టోబరు చివరి నాటికి 100 శాతం అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 39 కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేస్తోంది. రూ.299.90 కోట్లతో కొత్త కిచెన్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న కిచెన్ల విస్తరణ పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం 70 శాతం, రెండు స్వచ్ఛంద సంస్థలు 30 శాతం చొప్పున వ్యయం భరిస్తున్నాయి. పూర్తిస్థాయి అమలుతో సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.