2 days School Holidays: తెలంగాణలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందస్తు చర్యగా హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం రోజున సెలవు ప్రకటించింది.