విద్యుత్ భారానికి జగన్ అవినీతే కారణం.. దర్శిలో ఫ్లెక్సీలు కలకలం

3 weeks ago 3
ప్రకాశం జిల్లా దర్శిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం కలకలం రేపుతోంది. మాజీ సీఎం అవినీతి కారణంగానే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. జగన్మోహన్‌రెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడటం వల్లే రాష్ట్రంలో ప్రజల నడుం విరిగేలా విద్యుత్‌ చార్జీలు పెరిగాయని ఆ పార్టీ ఆరోపించింది. దీంతో వివాదాస్పద ఫ్లెక్సీల అంశంపై పోలీసులు, మున్సిపల్‌ కమిషనర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనంగా తాము చేపట్టిన నిరసనలకు సృష్టిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని వైయ‌స్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read Entire Article