తెలంగాణలో రూ.7,635.32 కోట్ల విద్యుత్ సర్‌ఛార్జి వసూళ్లను ఏడాది పాటు నిలిపివేస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. డిస్కంలు దాఖలు చేసిన ట్రూఅప్ పిటిషన్లపై స్పందించిన ప్రభుత్వం.. విద్యుత్ రంగంలో రాబోయే మార్పుల దృష్ట్యా ఏడాది పాటు నిలివేయాలని కోరింది. దీంతో సర్‌ఛార్జి వసూళ్లను ఈఆర్‌సీ నిలిపివేయగా.. వినియోగదారులపై తక్షణ భారం తప్పింది. ఇప్పటికే ఉన్న ఎఫ్‌ఎస్‌ఏ భారం పక్కన పెడితే.. కేవలం ఈ రెండేళ్ల ట్రూఅప్ అంశంపై ప్రభుత్వం ఏడాది తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది.