విమానాశ్రయాల్లో 24 గంటలు బార్లు, వైన్‌షాపులు.. ఏపీ ఎక్సైజ్ శాఖ సరికొత్త పాలసీ..!

3 hours ago 1
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి మినహా మిగతా అన్ని విమానాశ్రయాల్లో 24 గంటలూ తెరిచి ఉంచే బార్లు, వైన్‌షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్‌ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బార్ల నాన్‌ రిఫండ్‌బుల్‌ దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు, వైన్‌షాపులకు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా బార్ల వార్షిక లైసెన్స్ ఫీజు రూ.15 లక్షల నుండి రూ.25 లక్షల వరకు ఉండనుంది. ఎయిర్‌పోర్ట్ వైన్‌షాపుల వార్షిక లైసెన్సు రుసుమును రూ.కోటిగా ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ సోమ లేదా మంగళవారాల్లో విడుదల కానుంది.
Read Entire Article